RAa Musik

Friday 2 November 2012

surya IPS

నెలరాజా ఇటుచూడరా
నెలరాజా ఇటుచూడరా
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
తగువేలరా తగు వేళరా రవితేజా
నవరోజా తెరతియ్యవా
నవరోజా తెరతియ్యవా

నీకోసం ఆశగా నిరీక్షించె ప్రాణం
నీ చేతుల వాలగా చిగిర్చింది ప్రాయం
నీవైపే దీక్షగా చెలించింది పాదం
నీ రూపే దీపమై ప్రయాణించె జీవం
నివాళిచ్చి నవనవలన్నీ నివేదించనా
నువే లేని నిముషాలన్ని నిషేధించనా
రతిరాజువై జత చేరవా
విరివానవై నను తాకవా
నవరోజా తెరతియ్యవా
నవరోజా తెరతియ్యవా
దివితారక తవితీరగా నిను చూచా
జవనాలతో జరిపించవే జత పూజా
నెలరాజా ఇటుచూడరా
నెలరాజా ఇటుచూడరా

ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని
ఈ స్నేహం జంటగా జగాలేలుకోని
నీ కన్నుల పాపగా కలలు ఆడుకోని
నీ కౌగిలి నీడలో సదా సాగిపోని
ప్రపంచాల అంచులు దాటి ప్రయాణించనీ
దిగంతాల తారల కోట ప్రవేశించనీ
గత జన్మనే బ్రతికించనీ
ప్రణయాలలో శృతి పెంచని
నెలరాజా ఇటుచూడరా
నవరోజా తెరతియ్యవా
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
జవనాలతో జరిపించవే జత పూజా
నెలరాజా ఇటుచూడరా
నవరోజా తెరతియ్యవా

No comments:

Post a Comment