RAa Musik

Friday 2 November 2012

allari priyudu

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా
బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
కృష్ణుని మధురా నగరమా
కృష్ణా సాగర కెరటమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నులా
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతునా
సంగీతమా ఆ.. ఈ నింగిలో.. ఓ..
విరిసిన స్వరములే ఏడుగా వినపడు హరివిల్లెక్కడ
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
అందమా నీ పేరేమిటి అందమా
తెలుపమా నీ ఊరేమిటి పరువమా

భావ కవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వింపించడా
ఓ కావ్యమా.. ఆ.. నీ తోటలో.. ఓ..
నవరస పోషణే గాలిగా నవ్విన పూలే మాలగా
పూజకే సాధ్యమా తెలుపుమా

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా
బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

No comments:

Post a Comment