RAa Musik

Error loading feed.

Friday, 2 November 2012

nuvve kavaali

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు..
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు

ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
గతమంటు ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం
కనులు మూసుకొని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయానం
ప్రతిక్షణం ఎదురయే నన్నే దాటగలదా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు

గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
నా హృదయం నీ చెలిమిదా ముడి వేసే ఇంకొకరిదా
నిన్న మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువు ఎటు ఉన్నా
చినుకులో కరగక శిలై ఉండగలవా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు..

No comments:

Post a Comment