RAa Musik

Friday 2 November 2012

sega

వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే
ఇది మరి ప్రణయమా.. ప్రళయమా..
హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది భాదో ఏదో..
కునుకేమో దరికి రాదు ఒణుకేమో ఒదిలిపోదు
ఏ వింత పరుగు నాదో
నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం
వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే
ఇది మరి ప్రణయమా.. ప్రళయమా..
హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది భాదో ఏదో..

పసి వయసులో నాటిన విత్తులు ఓ.. ఓ.. హో..
మన కన్నా పెరిగెను ఎత్తులు ఓ.. హో..
విరబూసెను పువ్వులు ఇప్పుడు ఓ.. ఓ.. హో..
కోసిందెవరు అప్పటికప్పుడు ఓ.. హో..
నువ్వు తోడై ఉన్న నాడు పలకరించే దారులన్ని
దారిని తప్పుతున్నవే

నా కన్నులు కలలకు కొలనులు ఓ.. ఓ.. హో..
కన్నీళ్ళతో జారెను ఎందుకు ఓ.. హో..
నా సంధ్యలు చల్లని గాలులు ఓ.. ఓ.. హో..
సుడిగాలిగ మారెను ఎందుకు ఓ.. హో..
ఇన్నినాళ్ళు ఉన్న స్వర్గం నరకంలాగ మారెనీ
చిత్ర వధ నీకు ఉండదా..

వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే
ఇది మరి ప్రణయమా.. ప్రళయమా..
హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది భాదో ఏదో..
కునుకేమో దరికి రాదు ఒణుకేమో ఒదిలిపోదు
ఏ వింత పరుగు నాదో
నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం
వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే
ఇది మరి ప్రణయమా.. ప్రళయమా..
హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది భాదో ఏదో..

No comments:

Post a Comment