RAa Musik

Monday, 29 October 2012

mr.perfect

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది
నీ వైపే మళ్ళింది మనసూ
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుంది వయసూ
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తునట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు
చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది
నీ వైపే మళ్ళింది మనసూ
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుంది వయసూ

గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీదీ నాది
తలపులు వేరైనా కలవని పేరైనా
బలపడి పోతుందే ఉండే కొద్దీ
లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశం పైకే వెళుతున్నట్టు
తారలన్నీ తారసపడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తునట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు

నీపై కోపాన్ని ఎందరి ముందైనా
బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా
తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తునట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు

No comments:

Post a Comment